Articles

The Section 22-A Dilemma: How Technical Glitches and Blanket Freezes Threaten Genuine Land Titles

సెక్షన్ 22-A గందరగోళం: సామాన్యుడి ఆస్తి హక్కుపై సాంకేతిక సంకెళ్లు

సమాజంలో చట్టం అనేది పౌరుడి హక్కులను కాపాడటానికి ఒక కవచంలా నిలవాలి తప్ప, వారి స్వార్జిత ఆస్తిపై అకారణ ఆంక్షలు విధించే ఆయుధంగా మారకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ, అది పౌరుడికి రాజ్యాంగం కల్పించిన తిరుగులేని రాజ్యాంగబద్ధమైన హక్కు. అయితే, నేడు తెలంగాణ వ్యాప్తంగా—ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో—రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A పేరిట జరుగుతున్న పరిణామాలు సామాన్యులను, రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.  జీవితకాల...

Trapped by Amendments: How Land Acquisition Laws Undermine Citizen Rights

చట్టాల ఉచ్చులో పౌరుల భూసేకరణ హక్కులు! భారతదేశంలో ఒక వ్యవసాయ కుటుంబానికి భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు వారి ఆత్మగౌరవ ప్రతీక. అందుకే రైతు తన భూమిని కంటికి రెప్పలా చూసుకుంటూ, దానితో ఒక ఆత్మీయ, సంస్కృతీ, సాంప్రదాయాలతో  కూడుకున్న అనుబంధాన్ని పెంచుకుంటాడు.  ఒక రైతు పొలంలో నాటు వేస్తున్నాడంటే లేదా నాగలి పట్టి సాగు చేస్తున్నాడంటే అది కేవలం ఆ ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ఆ ఒక్క ఎకరం నేల చుట్టూ ఒక ఇరుసులా తిరిగే సమగ్ర గ్రామీణ ఆర్థిక...

Justice Delayed is Justice Denied!

"న్యాయం ఆలస్యమైతే... అది న్యాయాన్ని నిరాకరించినట్లే" (Justice Delayed is Justice Denied) — సమాజంలో మనం తరచూ వినే మాట ఇది. ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు, అతనికి సరైన సమయంలో న్యాయం అందకపోతే ఆ తర్వాత వచ్చే తీర్పు ఎంత గొప్పదైనా దానికి విలువ ఉండదు. ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి ప్రాణాలు పోయాక విందు భోజనం పెడితే ఎంత ప్రయోజనమో, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి జీవితం ముగిసిపోయాక వచ్చే తీర్పు కూడా అంతే! వ్యవస్థాగత లోపాలు: భారతదేశంలో ఒక సివిల్ లేదా...

What Causes People’s Suffering? And What is the Intellectual’s Responsibility?

ప్రజల కష్టాలకు కారణమేంటి? బుద్ధిజీవుల బాధ్యత ఏమిటి?"

ప్రజలకు తాము పడుతున్న కష్టాలు అనుభవంలో ఉంటాయి, కానీ ఆ కష్టాల వెనుక ఉన్న అసలు కారణాలు వారికి పూర్తిగా తెలియకపోవచ్చు. అనుభవానికి, కారణానికి మధ్య ఉన్న ఆ అగాధాన్ని పూడ్చి, వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమే సమాజంలోని బుద్ధిజీవుల ప్రధాన కర్తవ్యం. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ప్రభుత్వం ఒక కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చిందని అనుకుందాం. ఆ చట్టంలోని లొసుగుల కారణంగా, సామాన్య రైతులు తమ భూములను సులభంగా, అతి తక్కువ నష్టపరిహారానికే కోల్పోతున్నారు....

error: Content is protected Contact Vinay Kumar Gattu !!