Justice Delayed is Justice Denied!
“న్యాయం ఆలస్యమైతే… అది న్యాయాన్ని నిరాకరించినట్లే” (Justice Delayed is Justice Denied) — సమాజంలో మనం తరచూ వినే మాట ఇది. ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు, అతనికి సరైన సమయంలో న్యాయం అందకపోతే ఆ తర్వాత వచ్చే తీర్పు ఎంత గొప్పదైనా దానికి విలువ ఉండదు. ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి ప్రాణాలు పోయాక విందు భోజనం పెడితే ఎంత ప్రయోజనమో, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి జీవితం ముగిసిపోయాక వచ్చే తీర్పు కూడా అంతే!
వ్యవస్థాగత లోపాలు:
భారతదేశంలో ఒక సివిల్ లేదా క్రిమినల్ కేసు ముగియడానికి ఏళ్లు, దశాబ్దాలు పట్టడం వెనుక కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. ప్రధానంగా, కోర్టుల్లో గుట్టలుగా పేరుకుపోతున్న కేసులతో పోలిస్తే వాటిని విచారించే న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వ్యవస్థకు పెద్ద శాపంగా మారింది. దీనికి తోడు, చాలా కేసుల్లో నిందితులు కావాలనే రకరకాల ఎత్తుగడలతో విచారణను ఆలస్యం చేస్తుంటారు; ముఖ్యంగా పోలీస్ చార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా నిందితులకు కోర్టు నోటీసులు (Summons) అందడానికే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా నిందితులు కోర్టుకు హాజరుకాకుండా వాయిదాలు కోరడం లేదా తప్పించుకు తిరగడం వల్ల, విచారణ అసలు ప్రారంభ దశలోనే స్తంభించిపోయి కేసులు నత్తనడకన సాగుతున్నాయి
ఆలస్యం బాధితులకు శాపం.. నిందితులకు వరం!
కేసులు ఆలస్యం కావడం వల్ల నిందితుల కంటే ఎక్కువగా నలిగిపోయేది బాధితులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు తమ జీవితకాల కష్టార్జితాన్ని లేదా హక్కులను కోల్పోయి, ముసలి వయసులో ప్రశాంతంగా ఉండాల్సింది పోయి కోర్టుల చుట్టూ తిరగడం ఒక నరకంలా మారుతోంది; ఈ శారీరక శ్రమ వల్ల వారు శారీరకంగా కృశించిపోవడమే కాకుండా తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. అంతేకాకుండా, ఒక కేసు దశాబ్దాల పాటు సాగడం వల్ల కాలక్రమేణా సాక్షుల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం లేదా వారు చనిపోవడం జరిగి సాక్ష్యాలు బలహీనపడతాయి, ఇది పరోక్షంగా తప్పు చేసిన నిందితుడికే లాభం చేకూరుస్తుంది. వీటన్నింటికీ తోడు, ప్రతి వాయిదాకు కోర్టుకు తిరగడం, లీగల్ ఖర్చులు మరియు లాయర్ ఫీజులు భరించడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తూ ఒక పెద్ద శాపంగా మారుతోంది.
త్వరితగతిన విచారణ: ఇది మన ప్రాథమిక హక్కు!
మన రాజ్యాంగం ప్రకారం, త్వరగా న్యాయం పొందడం అనేది కేవలం ఒక కోరిక కాదు… అది ప్రతి పౌరుడి హక్కు! రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) కింద ప్రతి ఒక్కరికీ “త్వరితగతిన విచారణ” (Right to Speedy Trial) పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది (హుస్సేనారా ఖాతూన్ కేసు తీర్పు దీనికి పెద్ద ఉదాహరణ). న్యాయం అనేది కేవలం నిందితుల హక్కులను కాపాడటానికే కాదు, బాధితుడికి సకాలంలో ఊరటనివ్వడానికి కూడా!
మరి కింది కోర్టుల్లో (Trial Courts) కేసు కేవలం నిందితులు రావడం లేదనో, లేదా మరేదైనా కారణంతో సంవత్సరాల తరబడి ఒకే చోట ఆగిపోతే బాధితుడు ఏం చేయాలి? లబోదిబోమంటూ కూర్చోవాలా? లేదు!
బాధితుడు లాయర్ ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 482 (ప్రస్తుత BNSS లోని సెక్షన్ 528) కింద హైకోర్టులో “Early Disposal Petition” (త్వరితగతిన కేసు పరిష్కార పిటిషన్) దాఖలు చేయవచ్చు.
ఎటువంటి సందర్భాలలో హైకోర్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 482 (ప్రస్తుత BNSS లోని సెక్షన్ 528) కింద ‘Early Disposal’ కోరవచ్చు?
హైకోర్టులో Early Disposal Petition దాఖలు చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉండాలి. ముఖ్యంగా నిందితులు కావాలనే వాయిదాలు కోరుతూ విచారణను అడ్డుకుంటున్నా, చార్జ్ షీట్ దాఖలయ్యాక కూడా కేవలం సమన్లు లేదా నిందితుల హాజరు కోసమే (Summons / Appearance Stage) కేసు సంవత్సరాల తరబడి ఒకే చోట స్తంభించిపోయినా హైకోర్టును ఆశ్రయించవచ్చు. వీటితో పాటు బాధితులు వృద్ధులు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, కేసు మరీ సుదీర్ఘంగా సాగడం వల్ల కాలక్రమేణా సాక్షులు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉన్నా, మరియు మహిళలు లేదా సీనియర్ సిటిజన్ల కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన కాలపరిమితి మార్గదర్శకాలను కింది కోర్టులు పాటించనప్పుడు బాధితుడు ‘త్వరితగతిన పరిష్కారం’ కోరడానికి ఖచ్చితమైన అర్హత పొందుతాడు.
సకాలంలో అందని న్యాయం… అన్యాయంతో సమానం!
న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలగాలంటే తీర్పులు సరైన సమయంలో రావాలి; ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ప్రాణాలు పోయాక వచ్చే తీర్పు బాధితుడికి ఏమాత్రం ఉపశమనాన్ని ఇవ్వలేదు. అందుకే, వృద్ధులైన బాధితులు తమ జీవితాంతం నిరీక్షించే పరిస్థితి మారాలి సకాలంలో అందని న్యాయం, బాధితుడికి మరోసారి అన్యాయం చేయడంతోనే సమానమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
“Justice delayed is justice denied” — this is a phrase we frequently hear in society. When an injustice is done to a person, if they do not receive justice at the right time, then no matter how great the subsequent judgment is, it holds no value. Just as serving a grand feast to a starving person after they have lost their life is of no use, a verdict delivered after years of wandering around courts and after life itself has ended is equally meaningless!
Structural Flaws
There are some bitter truths behind why it takes years or even decades for a civil or criminal case to conclude in India. Primarily, compared to the mountains of cases piling up in courts, the number of judges available to hear them is extremely low, which has become a major curse for the system.
In addition to this, in many cases, the accused intentionally delay the trial using various tactics. Specifically, even after the police file a charge sheet, years pass just for court notices (Summons) to be served to the accused. Due to the accused seeking adjournments without appearing in court or evading appearances altogether, trials stall at the very initial stage, and cases move at a snail’s pace.
Delay is a Curse for Victims… A Boon for the Accused!
There is no doubt that due to the delay in cases, it is the victims who suffer much more than the accused. Especially for the elderly and retired employees, who lose their lifelong hard-earned savings or rights, having to run around courts instead of living peacefully in their old age turns into a living hell. Due to this physical exertion, they not only deteriorate physically but also undergo severe mental agony.
Furthermore, because a case drags on for decades, over time, the memory of witnesses fades or they pass away, weakening the evidence, which indirectly benefits the wrongdoer. Added to all of this, traveling to court for every hearing and bearing legal expenses and lawyer fees damages the financial condition of poor and middle-class families, becoming a massive burden.
Speedy Trial: This is Our Fundamental Right!
According to our Constitution, getting justice quickly is not just a wish… it is the right of every citizen! The Supreme Court has clarified that under Article 21 of the Constitution (Right to Life and Personal Liberty), everyone has the “Right to Speedy Trial” (the Hussainara Khatoon case judgment is a prime example of this). Justice is not meant only to protect the rights of the accused, but also to provide timely relief to the victim!
So, what should a victim do if a case in the lower courts (Trial Courts) gets stalled in the exact same place for years, simply because the accused is not showing up or for some other reason? Should they just sit back and lament? No!
The victim can approach the High Court through a lawyer. Under Section 482 of the Criminal Procedure Code (CrPC) (Section 528 of the current BNSS), an “Early Disposal Petition” (a petition for speedy resolution of the case) can be filed in the High Court.
Under what circumstances can ‘Early Disposal’ be sought in the High Court under Section 482 of the Criminal Procedure Code (CrPC) (Section 528 of the current BNSS)?
There must be strong reasons to file an Early Disposal Petition in the High Court. A victim is fully eligible to seek a ‘speedy resolution’ under the following circumstances:
- When the accused is intentionally seeking adjournments to obstruct and delay the trial.
- When, even after the charge sheet is filed, the case remains stalled in the exact same place for years merely for the purpose of serving summons or securing the appearance of the accused (Summons / Appearance Stage).
- When the victims are elderly or suffering from severe illnesses.
- When the case is dragging on so excessively that there is a high risk of witnesses becoming unavailable or passing away over time.
- When the lower courts fail to follow the time-bound guidelines issued by the Supreme Court regarding cases involving women or senior citizens.
Justice Not Received in Time… is Equivalent to Injustice!
For a common man to have faith in the judicial system, judgments must be delivered at the right time. A verdict delivered after years of running around courts and after a person has passed away offers absolutely no solace to the victim. Therefore, the situation where elderly victims have to wait for the rest of their lives must change. Everyone must recognize that justice not delivered in time is equivalent to committing another injustice against the victim.
Leave a Reply