Workplace Stress: A Silent Killer – An In-depth Analysis of Employees Legal Rights and Corporate Responsibilities

Back to Blog

Workplace Stress: A Silent Killer – An In-depth Analysis of Employees Legal Rights and Corporate Responsibilities

Workplace stress is one of the biggest problems faced by many employees in today’s competitive world. If this stress, combined with excessive workload, persists for a long time, it can turn into anxiety, leading to serious mental and physical health problems like insomnia, depression, high blood pressure, and heart diseases.

Unfortunately, a recent tragic incident has come to the attention of the National Human Rights Commission (NHRC). The NHRC has taken suo motu cognizance of and registered a case regarding the news of the death of a 26-year-old chartered accountant due to work stress.

What happened?

News reports surfaced that a 26-year-old chartered accountant from Kerala, working in a prominent company in Pune, died due to excessive work stress.

The deceased’s mother made serious allegations against the company, stating that her daughter had joined the company just four months ago and had been under severe work stress since then. She claimed that her daughter’s death was a direct result of the impact this stress had on her physical and mental health.

However, the company denied these allegations. The Union Ministry of Labor and Employment is currently investigating the incident.

What is the NHRC saying?

The NHRC has taken these reports very seriously. It indicated that this incident reflects the problems and challenges faced by young employees. It further noted that they are grappling with issues like mental stress, anxiety, and insomnia.

The NHRC stated that employees are struggling to meet the targets set by companies within deadlines. This increased anxiety is detrimental to their physical and mental health. It established that such actions constitute a violation of human rights.

The NHRC emphasized that every employer has a responsibility to provide a safe, secure, and positive environment for their employees and treat everyone working with them with respect and fairness.

Furthermore, the commission suggested that businesses should be accountable for human rights issues and regularly review their work and employment policies and regulations to align with global human rights standards.

Stressful work environment – A threat to mental health

A stressful work environment in the office can severely affect the mental health of employees. Scolding, insulting, or threatening employees for making mistakes at work can damage their self-confidence.

Moreover, comparing them with other employees and setting unrealistic goals can also cause anxiety and depression.

What is the solution to these problems?

What Companies should do:

Companies should provide their employees with appropriate working hours and breaks. They should allocate enough time for them to complete their work efficiently.

In addition to creating a positive work environment, companies should encourage employees, respect them, and foster their creativity. Along with this, they should organize programs like meditation and yoga.

What Employees should do:

It is very important for employees to maintain a balance between their work and personal life. While doing the work assigned by the company, employees should plan in such a way that they spend some time with their family members and friends in a pleasant atmosphere every day.

Proper working hours and breaks: What does the law say?

According to Article 21 of the Indian Constitution, every person has the right to life. This right also includes living a healthy life. Excessive work stress and long working hours can damage the physical and mental health of employees. Therefore, creating such situations is a violation of employees’ right to life.

What rights do employees have?

Every company should provide its employees with a safe, healthy, and stress-free work environment.

Working for long hours is detrimental to health. Every employee should be given proper rest time during working hours. Employees should be given at least a 30-minute break after every 5 hours of work. Also, at least one hour of lunch break should also be provided.

Overtime should not exceed 6 hours per week. Employees should be paid additional wages for overtime work. This additional wage should be at least double the regular wage according to the Factories Act, 1948.

It is also the responsibility of companies to monitor the mental state of employees and provide services like counseling if necessary.

Is there a possibility of any change after the Kerala incident?

The initiative taken by the National Human Rights Commission in this matter makes it clear that corporate organizations need to be more careful about the rights of their employees from now on. It reminds them that protecting the health and well-being of employees is not only a legal matter but also a moral responsibility.

Work stress, long working hours, and a stressful work environment can severely affect the mental and physical health of employees. Companies and employees need to work together to address these issues. Protecting the well-being of employees is not just a legal matter but also a moral responsibility.

Further action may be taken based on the investigation report.

By providing a positive work environment for employees, they can not only work happier and more efficiently but also protect their mental and physical health. Companies should consider not only their profits but also the well-being of their employees. Only then can we prevent such tragic incidents from happening again.

This tragic incident raises serious questions about the work culture in our offices. Protecting the mental and physical health of young employees is crucial. Corporate organizations should consider not only profits but also the well-being of their employees.

పని ఒత్తిడి మృత్యువును తెస్తుందా? – ఉద్యోగుల చట్టపరమైన హక్కులు, కార్పొరేట్ బాధ్యతలపై లోతైన విశ్లేషణ.

పని ఒత్తిడి అనేది పోటీతత్వంతో నిండిన ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. అధిక పని భారంతో కూడిన ఈ ఒత్తిడి దీర్ఘకాలికంగా కొనసాగితే, అది ఆందోళనగా మారి, నిద్రలేమి, నిరాశ, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి తీవ్రమైన మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన ఓ విషాద ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దృష్టికి వచ్చింది. 

పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ మరణం గురించిన వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వయంగా పరిగణనలోకి తీసుకొని  సుమోటుగా కేసు నమోదు చేసింది.

అసలు ఏం జరిగింది?

కేరళకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ పూణేలోని ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తూ, అధిక పని ఒత్తిడి కారణంగా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. 

మృతురాలి తల్లి కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసింది తన కూతురు కేవలం నాలుగు నెలల క్రితమే ఈ ఉద్యోగంలో చేరిందని, ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి లోనైందని దానికి కారణంగానే శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావ పడడం వల్లే తన కూతురు మరణించిందని ఆరోపించింది. 

అయితే, కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనపై కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోంది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏం చెబుతోంది?

ఈ వార్తలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా పరిగణించింది. యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు మరియు సవాళ్లను ఈ సంఘటన అద్దం పడుతుందని సూచించింది. 

మరియు మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో వారు సతమతమవుతున్నారని పేర్కొంది. 

కంపెనీలు సూచించే లక్ష్యాలను గడువులోపు అందుకోవడానికి ఉద్యోగులు సతమతమవుతున్నారని దీని కారణంగానే ఆందోళన పెరిగి వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది. ఇలాంటి చర్యలు అన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని స్పష్టం చేసింది.

ప్రతి యజమాని తన ఉద్యోగులకు సురక్షితమైన, భద్రమైన మరియు సానుకూల వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉందని, తమతో పనిచేసే ప్రతి ఒక్కరినీ గౌరవంగా మరియు న్యాయంగా చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నొక్కి చెప్పింది. 

అంతేకాకుండా, వ్యాపారాలు మానవ హక్కుల సమస్యలకు బాధ్యత వహించాలని, ప్రపంచ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా తమ పని మరియు ఉపాధి విధానాలు మరియు నిబంధనలను క్రమం తప్పకుండా సవరించాలని కమిషన్ సూచించింది.

ఒత్తిడితో కూడిన కార్యాలయ వాతావరణం – మానసిక ఆరోగ్యానికి ముప్పు

కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పనిలో తప్పులు చేస్తే తిట్టడం, అవమానించడం, బెదిరించడం వంటివి ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. 

అంతేకాకుండా, ఇతర ఉద్యోగులతో పోల్చడం, అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించడం వంటివి కూడా వారిలో ఆందోళన మరియు నిరాశను కలిగిస్తాయి.

ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి?

కంపెనీలు చేయవలసినవి:

కంపెనీలు తమ ఉద్యోగులకు సరైన పనివేళలు మరియు విరామాలను కల్పించాలి. వారు తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి తగినంత సమయాన్ని కేటాయించాలి.

ఉద్యోగులకు సానుకూలమైన పని వాతావరణాన్ని కల్పించడంతోపాటు ఉద్యోగులను ప్రోత్సహించడం, వారిని గౌరవించడం, వారి సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటివి చేయాలి. దీనితోపాటు ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలను నిర్వహించాలి.

ఉద్యోగులు చేయవలసినవి:

ఉద్యోగులు తమ పని మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కంపెనీ సూచించినటువంటి పనిని చేస్తూనే ఉద్యోగస్తులు వారి  కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో  రోజులో కొంత సమయాన్ని అహల్లాదకరమైన వాతావరణంలో గడిపే విధంగా ప్లాన్ చేసుకోవాలి.  

సరైన పనివేళలు మరియు విరామాలు: చట్టం ఏమి చెబుతుంది?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ఈ హక్కులో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కూడా ఇమిడి ఉంటుంది. అధిక పని ఒత్తిడి, సుదీర్ఘ పనివేళలు వంటివి ఉద్యోగుల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల, ఇలాంటి పరిస్థితులు కల్పించడం ఉద్యోగుల జీవించే హక్కును ఉల్లంఘించడమే అవుతుంది.

ఉద్యోగులకు ఏ హక్కులు ఉన్నాయి?

ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు ఒత్తిడి లేని పని వాతావరణాన్ని కల్పించాలి.

సుదీర్ఘంగా పనిచేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రతి ఉద్యోగికి పనివేళల్లో సరైన విశ్రాంతి సమయం ఇవ్వాలి. ఉద్యోగులకు ప్రతి 5 గంటల పని తర్వాత కనీసం 30 నిమిషాల విరామం ఇవ్వాలి. అలాగే, కనీసం ఒక గంట భోజన విరామం కూడా ఇవ్వాలి.

వారానికి ఓవర్ టైం 6 గంటలకు మించకూడదు. ఓవర్ టైం పని చేసినందుకు ఉద్యోగికి అదనపు వేతనం చెల్లించాలి. ఈ అదనపు వేతనం ఫ్యాక్టరీల చట్టం, 1948 ప్రకారం సాధారణ వేతనం కంటే కనీసం రెట్టింపు ఉండాలి. 

ఉద్యోగుల మానసిక స్థితిని పరిశీలించడం, అవసరమైతే కౌన్సెలింగ్ వంటి సేవలు అందించడం కూడా కంపెనీల బాధ్యతే.

 

కేరళ ఘటన తర్వాత ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా

ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చొరవ తీసుకోవడం, కార్పొరేట్ సంస్థలు ఇకపై ఉద్యోగుల హక్కుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తుంది. 

ఉద్యోగుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటం కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, నైతిక బాధ్యత కూడా అని గుర్తు చేస్తుంది.

పని ఒత్తిడి, సుదీర్ఘ పనివేళలు, ఒత్తిడితో కూడిన కార్యాలయ వాతావరణం వంటివి ఉద్యోగుల మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. 

ఈ సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలు మరియు ఉద్యోగులు కలిసి కృషి చేయాలి. ఉద్యోగుల శ్రేయస్సును కాపాడటం కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదు, ఒక నైతిక బాధ్యత కూడా.

దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఉద్యోగులకు సానుకూలమైన పని వాతావరణం కల్పించడం తద్వారా వారు మరింత సంతోషంగా, సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా, వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కంపెనీలు తమ లాభాలను మాత్రమే కాకుండా, తమ ఉద్యోగుల శ్రేయస్సును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మనం ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించగలం.

ఈ విషాద ఘటన మన కార్యాలయాల పని సంస్కృతిపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. యువ ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడటం అత్యవసరం.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Blog
error: Content is protected Contact Vinay Kumar Gattu !!